నిరుద్యోగులకు శుభవార్త.. 5089 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:01 IST)
నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో 5089 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులున్నాయి. 
 
బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే టెట్‌ పరీక్షలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి.
 
ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్ష-2023 నిర్వహించనున్నారు. అయితే పశ్నాపత్రాల లీకేజీ లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఆన్‌లైన్‌లో టీఆర్‌ఐ పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు