విజయ్ దేవరకొండ పారితోషికంలో 50% వదులుకున్నాడు.. దేనికి?

శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (11:01 IST)
Vijay Devarakonda
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా బాగా రన్ అవుతోంది. కానీ విజయ్ గత సినిమా ప్లాప్ వల్ల అది ఇప్పుడు చర్చగా మారింది. వరల్డ్ ఫేమస్ లవర్‌ చిత్రానికి నిర్మాత కె ఎస్ రామారావు. ఆ సినిమా పంపిణీదారుడు అభిషేక్.. తనకు నష్టం వచ్చిందని విజయ్ పై అభిషేక్ ఆరోపణలు చేశారు. దీనిపై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు ను ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేసింది. 
 
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు  గోవర్ధన్ రావు మాట్లాడుతూ, అభిషేక్ తన కుమారుడు విజయ్ దేవరకొండపై 'నిరాధార ఆరోపణలు' చేశారు. దాని బదులు తనకు ఏదైనా డబ్బు చెల్లించాల్సి ఉందని భావిస్తే కోర్టులను ఆశ్రయించాలని అన్నారు.
 
అభిషేక్ నామాతో విజయ్ దేవరకొండకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, అభిషేక్ నామాతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డిస్ట్రిబ్యూటర్‌గా, వరల్డ్ ఫేమస్ లవర్‌పై వచ్చిన నష్టాలపై నిర్మాత కె ఎస్ రామారావుతో అతనికి కొంత వివాదం ఉంది, అయితే కె ఎస్ రామారావు ను ఏమి అనలేక దానిని విజయ్ దేవరకొండ వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. మేము అతనికి ఏమీ బాకీ లేనప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కూడా మానవతా దృక్పథంతో అభిషేక్‌ని కలిశాము.
 
సినిమా కోసం విజయ్‌కి ఇచ్చే పారితోషికంలో 50% వదులుకున్నామని, సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రామారావు ఇచ్చిన ఫ్లాట్‌ని స్వాధీనం చేసుకోలేదని కూడా చెప్పాం. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నింటికంటే మించి, అభిషేక్ మమ్మల్ని సంప్రదించినప్పుడు, విజయ్ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్,  గీతా ఆర్ట్స్‌తో చిత్రాలకు సంతకం చేశాడు, కాబట్టి మాకు డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పాము. దాని సాకుగా చూపుతో లేనిపి నిందలు అభిషేక్ వేస్తున్నాడని గోవర్ధన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు