కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన యూజీసీ

మంగళవారం, 17 జనవరి 2023 (12:43 IST)
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మౌలిక సదుపాయాల రూపకల్పన, పరిశోధనల్లో నాణ్యతను మెరుగుపరచడానికి అవసరమైన వనరుల కేటాయింపునకు సంబంధించి ఈ మార్గదర్శకాలను ఖరారు చేశారు. 
 
ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో గుణాత్మక మెరుగుదలను తీసుకునిరావడానికి అన్ని విశ్వవిద్యాలయాలు ఒకదానితో ఒకటి వనరులను పంచుకోవాలని ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఈ మేరకు మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
మౌలిక సదుపాయాల నిర్వహణ, నిర్వహణకు నిరంతర నిధులు అవసరమవుతాయని, అందువల్ల హెచ్.ఈ.ఏలకు నామాత్రపు మొత్తాన్ని వసూలు చేయడం ద్వారా అందుబాటులో ఉన్న వనరులను అవసరం మేరకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు