సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కూర్చునే వారికి నెలకు 30వేల జీతం ఇస్తున్నారంటే నమ్ముతారా నమ్మి తీరాల్సిందే. వర్చువల్ సూపర్‌వైజర్‌గా పిలిచే ఈ ఉద్యోగం.. షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెబుతూ ఉండాలి.
అంతేకాదు.. భారత్‌లో కూర్చొనే ఈ పని చేయవచ్చు. ఈ ఉద్యోగాల్లో భారతీయులకే ఆమెరికా కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ మేరకు అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండాలి.