ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్.ఎం.డి.సి. అపోలో సెంట్రల్ హాస్పిటల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం అర్హులై అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నారు. సౌత్ బస్తర్ దంతేవాడ జిల్లాలోని బచ్చేలిలో ఉన్న వంద పడకల ఆస్పత్రిని అపోల్ హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఇందులో మెడిసన్, రేడియాలజీ, అనిస్తీషియా, ఆర్థోపిడిక్స్, ఈఎన్టి, సర్జరీ, పాథాలజీ, జీడిఎంఓ తదితర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
45 సంవత్సరాల తక్కువ వయస్సు కలిగిన అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మార్చి ఎనిమిదో తేదీన ఆదివారం ఉదయం 8.30 నిమిషాలకు ఎన్ఎండిసి అపోలో సెంట్రల్ హాస్పిటల్, బచ్చేలిలో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరుకావచ్చు.
బచ్చేలికి రాయ్‌పూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌ల నుంచి చేరుకోవచ్చు. వైజాగ్ నుంచి కిరండుల్ ప్యాసింజర్ రైలు ఉదయం 7.15 నిమిషాలకు బయలుదేరి 9.15 నిమిషాలకు బచ్చేలికి చేరుకుంటుంది.