న్యూఢిల్లీలోని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆఫ్ ఇండియా లిమిటెట్ (ఎడ్.సిఐఎల్)లో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సీనియర్ కన్సల్టెంట్/కన్సల్టెంట్ విభాగంలో ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు ప్రాజెక్టు మేనేజర్, 10బి ఎస్టేట్, న్యూఢిల్లీ-02 అనే చిరునామాకు పంపాల్సి వుంటుంది.
దరఖాస్తులను ఏప్రిల్ 16వ తేదీలోగా పంపాల్సి వుంటుంది. ఇందుకు అవసరమైన దరఖాస్తులను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అధికారిక వెబ్‌సైట్ ఈడీసిఐఎల్ డాట్ కామ్‌లో డౌన్‌లౌడ్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులను రాతపరీక్షలకు ఆహ్వానిస్తారు.