జాబ్స్: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రొబేషనరీ ఆఫీసర్లు తదితర ఉద్యోగాల్లో భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 1, 083 ఉద్యోగాల్లో భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

1. ప్రొబేషనరీ ఆఫీసర్లు (జేఎంజీ)- 1) మొత్తం... 460 పోస్టులున్నాయి. రూ. 10000-470/6- 12820- 500/3- 14320- 560/7- 18240 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఏదేని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో 60 లేదా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఇప్పటికే.. బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 21 నుంచి 30 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి.

2. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు (ఎంఎంజీ- 2) మొత్తం... 386 పోస్టులున్నాయి. రూ. 13820- 500/1- 14320- 560/10- 19920 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఏదేని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో 60 లేదా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఆఫీసర్ హోదా కలిగి కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 21 నుంచి 33 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి.

3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు (ఎంఎంజీ- 3) మొత్తం... 237 పోస్టులున్నాయి. రూ. 18240-560/5 - 21040 - 620/2 - 22280 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఏదేని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో 60 లేదా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఆఫీసర్ హోదాతో పాటు ఐదుళ్ల కనీస అనుభవం ఉండాలి. 24 నుంచి 35 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి.

గమనిక:
ఈ మూడు రకాల పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి. అలాగే వీరికి అర్హత మార్కుల్లోను 5 శాతం వరకు సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారఅభ్యర్థులు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

అబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, నవంబర్ 30. పరీక్ష నిర్వహించు తేదీ.. 2010, జనవరి 24. మరిన్ని వివరాలకు హెచ్‌టీటీపీ://బ్యాంక్ఆఫ్‌ఇండియాడాట్‌కామ్/కెరీర్‌డాట్ఏఎస్‌పీఎక్స్ చూడండి.

వెబ్దునియా పై చదవండి