టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. "రాజా సాబ్" టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "రాజా సాబ్" సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.