మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

దేవీ

గురువారం, 19 జూన్ 2025 (16:14 IST)
Bigg Boss Gautham Krishna donates to Murali Nayak's parents at Solo Boy trailer launch
సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి తనతో జంటగా నటించారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజిని వర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జుడా సంధ్య చిత్రానికి సంగీతం అందించారు. జులై 4వ తేదీన వెండి ధరపై ప్రేక్షకులను పలకరించనున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవలే భారతదేశ రక్షణాదనం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ... "మేము ఎంతో పేద కుటుంబం నుండి వచ్చాము. మాకు ఉన్న ఒక్క కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మా కొడుకు ఈరోజు మాకు దూరమైనప్పటికీ గౌతమ్ లాంటి మరొక కొడుకు మాకు దొరికాడు అనుకుంటాము. గౌతమ్ మాట్లాడుతుంటే మా అబ్బాయి మాట్లాడుతున్నట్లే ఉంది. అందుకే నేడు వేరే పని ఉన్నా కూడా కేవలం ఈ చిత్రం కోసం వచ్చాము. గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ రాబోతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము" అన్నారు.
 
చిత్ర దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో ఎంతోమంది మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు. సోలో బాయ్ చిత్రం మధ్య తరగతి కుటుంబాలను ప్రతిభంబిస్తూ ఉంటుంది. చిత్రంలో నటించిన నటీనటులు అందరూ అందరికీ తెలిసిన వారే. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను ఎంతో బాగా పోషించారు. అలాగే చిత్రం కోసం ఎంతో బలమైన టెక్నికల్ బృందం పనిచేశారు. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాత సతీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జులై 4వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ కచ్చితంగా థియేటర్ కు వెళ్లి ఈ చిత్రాన్ని చూడండి" అన్నారు.
 
చిత్ర నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ, సోలో బాయ్ అనగానే ఎంతోమంది ఇక్కడికి సోలోగా వచ్చి ఉన్నత స్థాయికి చేరిన వారు నాకు గుర్తొస్తారు. అలాగే సోలో భాయ్ ఉంటూ వస్తున్న మా చిత్రాన్ని జులై 4వ తేదీన ప్రేక్షకులంతా థియేటర్ కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. చిత్రానికి సాంకేతిక బృందంగా పనిచేసిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వారందరికీ ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటించిన గౌతమ్ కృష్ణ రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఒక పాయింట్లో సినిమాకు డబ్బులు తక్కువ అయిన సమయంలో తాను కూడా కొంత డబ్బు ఖర్చుపెట్టి సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాడు. సినిమా విజయం సాధించిన తర్వాతే తాను డబ్బు తీసుకుంటాను అని అన్నాడు. ఈ సినిమా ద్వారా గౌతమ్ కు మంచి బ్రేక్ వచ్చి తను ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన మురళి నాయక్ గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాము. సినిమాలు అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ గా నిలిచిన వారందరికీ థాంక్స్" అన్నారు.
 
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, మీ చిత్రానికి పెద్దవారు ఎవరు పని చేయనప్పటికీ చిత్రంలో కంటెంట్ హీరోగా నిలుస్తుంది. ఈ సినిమాలో నేనే కాదు, నా పాత్ర ఎవరు పోషించినా కూడా సినిమా మంచి హిట్ అవుతుంది ఎందుకంటే కంటెంట్ అటువంటిది. వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ లాంటి వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని తద్వారా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కోరుకున్నాము. మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీల కంటే ఈ కుటుంబీకులే పెద్దగా అనిపించరు. అందుకే వారిని ఆహ్వానించాము. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ప్రేక్షకులు మాత్రమే. కాబట్టి ఇకపై వీరందరి కోసం ఏదో ఒకటి చేయాలని చాలా బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ముందుగా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్ గారి కుటుంబానికి అందజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా వీలైనంతమందికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ప్రతి నెల నేను ఆ ట్రస్ట్ ద్వారా చేసే సహాయాన్ని నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెడతాను" అంటూ ముగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు