భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్)లో పదో తరగతి, ఐటీఐ విద్యార్హతలతో ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఎస్ఐ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉడాలి. వెహికల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్ కీపర్ విభాగాల్లో పోస్టులకు పే స్కేలు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400గా ఉంటుంది.
కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్ష, ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధితి డిగ్రీలో అనుభవం కూడా ఉండాలి. ఇందులో ఆటో ఎలక్ట్రిక్, వెహికిల్ మెకానిక్, వెల్డర్, టర్నర్, పెయింటర్ తదితర విభాగాలకు పే స్కోలును రూ.21,700 నుంచి రూ.69,100గా నిర్ణయించారు.
ఈ పోస్టులకు ఎంపిక విధానం రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుంగా బీ పోస్టులకు రూ.200, గ్రూపు సి పోస్టులకు రూ.100గా చెల్లించాల్సివుంటుంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ నెల 24వ ఆఖరు తేదీగా నిర్ణయించారు.