తాజా బడ్జెట్టులో మోదీ సర్కార్ వేసిన మరో భారీ అంచనా ఉద్యోగాల కల్పన. 2019-21 మధ్య కాలంలో 2.62 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఐతే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి అదే వేరే వ్యవహారం. కానీ ఎన్డీఏ మాత్రం తాము నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
వాస్తవానికి 2019 మార్చి 1 నాటికి ప్రభుత్వ సంస్థల్లో 32,62,908 మంది ఉద్యోగులు వున్నారు. ఈ సంఖ్య 2021 మార్చి 1 నాటికి 35,25,388కి చేరుతుందని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 మార్చి నాటికి కొత్తగా 2.62 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నమాట. ప్రభుత్వం వేస్తున్న అంచనాలు ఫలిస్తే ఉద్యోగాల కోసం రోడ్ల మీద తిరిగే యువత భవిష్యత్తులో కనిపించదు మరి.