ఉద్యోగాలు: భద్రత దళంలో మహిళా నర్సింగ్ అధికార్లు

మిలిటరీ నర్సింగ్ సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు భద్రతా దళం దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నర్సింగ్ అధికారులుగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న మహిళలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు... మొత్తం 250 ఖాళీలు. నర్సింగ్‌లో ఎమ్మెస్సీ లేదా బీఎస్సీ.. 2009, డిసెంబర్ 21వ తేదీ నాటికి వయసు 21 నుంచి 35 సంవత్సరాలోపు వారై ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ పరీక్ష, మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)ల విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు స్వీకరించు ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 9.
మరిన్ని వివరాలకు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌ఇండియన్ఆర్మీడాట్‌నిక్‌డాట్‌ఇన్'లో చూడండి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మినిస్ట్రీ డిఫెన్స్ (ఆర్మీ),
అడ్జుటంట్ జనరల్స్ బ్రాంచ్,
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఆర్మీ),
డీజీఎంఎస్- 4బీ, రూమ్ నెంబర్. 45, ఎల్ బ్లాక్,
హట్మెంట్స్, న్యూఢిల్లీ- 110 001.

వెబ్దునియా పై చదవండి