"ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్"లో 300 మంది ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలకుగానూ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు... ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వెనుకబడిన కులాలైన ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.
ఉద్యోగ వివరాల్లోకి వెళ్తే... మొత్తం ఖాళీల సంఖ్య 300 కాగా, జీతం స్కేలు పదివేల రూపాయల నుండి పద్దెనిమిదివేల, రెండువందల నలభై రూపాయల మధ్య ఉంటుంది. అభ్యర్థుల వయస్సు మాత్రం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇకపోతే... అభ్యర్థుల ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులు తిరిగీ రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ మరియు డిస్కిప్ట్రివ్ పద్ధతిలో ఉంటుంది.
ఆన్లైన్ విధానం ద్వారా పూర్తి చేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ నవంబర్ 3, 2008. మిగిలిన మరిన్ని వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఓబీసీఇండియా.కో.ఇన్ వెబ్సైట్లో చూడండి.