"టీఎన్ఓసీఎస్‌"లో నావిగేటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

గురువారం, 23 అక్టోబరు 2008 (18:31 IST)
FileFILE
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్ఓసీఎస్)... ట్రైనీ నావిగేటింగ్ ఆఫీసర్ క్యాడెట్స్ ఉద్యోగాల కోసం, అర్హత గల అవివాహిత స్త్రీ-పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ ఉద్యోగాలకు గానూ... ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అభ్యర్థులు 55 శాతానికి తగ్గకుండా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరైన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే.

అలాగే... బీఈ లేదా బీటెక్ లేదా దానికి సమాన అర్హత కలిగిన కోర్సులలో, 50 శాతం మార్కులకు తగ్గకుండా ఉత్తీర్ణత సాధించినట్టి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులకు ఇగ్నో సారథ్యంలో ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహించనుంది. ఇందులోనుండి షిప్పింగ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా 80 మంది ట్రయినీ నావిగేటింగ్ ఆఫీసర్ క్యాడెట్స్‌ను, ఫిబ్రవరి-2009 బ్యాచ్‌కుగానూ ఎంపిక చేస్తుంది.

పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్థులు "ఇగ్నీ అప్లికేషన్ ఫామ్స్ టు రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఈడీ), పోస్ట్ బాక్స్ నెం.2, ఇగ్నో, న్యూఢిల్లీ- 110068" అనే చిరునామాకు పంపగలరు. కాగా, దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ నవంబర్ 7, 2008. పూర్తి వివరాలకు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.షిప్ఇండియా.కామ్‌ను సంప్రదించండి.

వెబ్దునియా పై చదవండి