డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికై ఆంధ్రా వర్శిటీ ప్రకటన

శుక్రవారం, 31 అక్టోబరు 2008 (18:43 IST)
విశాఖ పట్టణంలోని ఆంధ్రా విశ్వ విద్యాలయం దూరవిద్య ద్వారా బీఏ, బీకాం లాంటి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికిగాను ప్రకటనను విడుదల చేసింది. ఈ కోర్సుల్లో చేరగోరే ఆసక్తి కలిగిన విద్యార్థులు 2009 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవారై ఉండాలి.

ఇందుకుగానూ మీరు చేయవల్సిందల్లా... "రిజిస్ట్రార్, ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖ పట్టణం" పేరుతో 80 రూపాయలకు తీసిన డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటు, సొంత చిరునామా కలిగిన కవరును "డైరెక్టర్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖ పట్టణం" అడ్రస్సుకు పంపి, దరఖాస్తులను పొందవచ్చు.

నేరుగా దరఖాస్తులను పొందగోరు విద్యార్థులు ఆయా స్టడీ సెంటర్ల నుంచి 50 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్‌ను చెల్లించి దరఖాస్తులను పొందవచ్చు. కాగా, దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ నవంబర్ 29, 2008 (ఫైన్‌తో డిసెంబర్ 6, ఆఖరు తేదీ). ప్రవేశ పరీక్షను డిసెంబర్ 28, 2009న నిర్వహిస్తారు.

అదనపు సమాచారం కోసం డబ్ల్యు.డబ్ల్యు.ఆంధ్రాయూనివర్శిటీ.ఇన్‌ఫో/ఎస్‌డీఈ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

వెబ్దునియా పై చదవండి