రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్‌డీవో)లో ఉన్న ఖాళీల్లో భాగంగా ఎస్సీ-ఎస్టీ పోస్టులను స్పెషల్ డ్రైవ్ కింద సైంటిస్ట్-బి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి డీఆర్‌డీవో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 25 ఖాళీలు ఉండగా, ఎస్సీ వర్గానికి ఏడు, ఎస్టీ విభగానికి 18 పోస్టులను కేటాయించారు.
ఈ పోస్టులు ఆర్కిటెక్చర్‌లో ఐదు, ఫిజికల్ కెమిస్ట్రీలో నాలుగు, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగంలో ఎనిమిది, పాలిమర్స్‌లో ఒకటి, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో నాలుగు, రబ్బర్ టెక్నాలజీలో ఒకటి, సిరామిక్ ఇంజనీరింగ్‌లో రెండు పోస్టులు చొప్పున ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పేస్కేల్‌గా రూ.15,600-39,100 చొప్పున చెల్లిస్తారు.
అభ్యర్థుల వయస్సు 33 సంవత్సరాలకు మించి ఉండరాదు. కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, జర్మని లేదా జపనీస్ భాషలు కూడా తెలిసుండాలి.
పూర్తి చేసిన దరఖాస్తులను డెరైక్టర్, రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్, లక్నో రోడ్, తిమర్‌పూర్, ఢిల్లీ-110054కి 20 రోజుల్లో పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను హెచ్‌టీటీ://ఆర్ఏసీ.డీఆర్‌డీఓ.ఐఎన్ వెబ్‌సైటులో చూడొచ్చు.