వివేకానందలో పర్సనాలిటీ కోర్సులు

బుధవారం, 5 నవంబరు 2008 (13:51 IST)
హైదరాబాదులోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్, రామకృష్ణ మఠంవారు నవంబర్‌లో నిర్వహించబోయే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికిగానూ అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.

కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి... పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్స్ (నవంబర్ 9 నుంచి ప్రారంభం), కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోర్స్ (నవంబర్ 10 నుంచి ప్రారంభం), హౌటు ఇన్‌ఫ్ల్యూయెన్స్ పీపుల్? (నవంబర్ 10 నుంచి ప్రారంభం), యోగా (నవంబర్ 10 నుంచి ప్రారంభం), కమ్యూనికేషన్ స్కిల్స్ (నవంబర్ 17, 24 నుంచి ప్రారంభం), లీడర్‌షిప్ క్వాలిటీస్ (నవంబర్ 17 నుంచి ప్రారంభం), మెడిటేషన్ (నవంబర్ 17 నుంచి ప్రారంభం), మైండ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ (నవంబర్ 24 నుంచి ప్రారంభం).

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కింది చిరునామాలో స్వయంగా, లేదా ఫోన్ ద్వారా అయితే ఉదయం 8.30 నుంచి 11.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల వరకు సంప్రదించవచ్చు. చిరునామా : వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్, రామకృష్ణ మఠం, రామకృష్ణ మఠ్ మార్గ్, దోమల్ గూడ, హైదరాబాద్ - 500029. ఫోన్ : 040-27627961.

వెబ్దునియా పై చదవండి