"సెయిల్‌"లో డిప్లొమా ఇంజనీర్ ఉద్యోగాలు

గురువారం, 30 అక్టోబరు 2008 (17:24 IST)
FileFILE
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) బిలాయ్ స్టీల్ ప్లాంట్ వారు డిప్లొమా ఇంజనీర్ (ట్రెయినీ) ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు.

జీత భత్యాలు, ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

వేతన స్కేలు : రూ.4170 నుండి రూ. 6096 కాగా... మెకానికల్ : 90, ఎలక్ట్రికల్ : 62, మెటలర్జీ : 62, ఎలక్ట్రానిక్స్ : 12, కెమికల్ : 12, సివిల్ : 12 మొత్తం 250 ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతల విషయానికొస్తే... అభ్యర్థులు మెట్రిక్‌తో పాటు, ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. వీరు జూలై 1, 2008 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. శిక్షణ కాలపరిమితి ఏడాది కాగా, ఈ సమయంలో 4,200 రూపాయల స్టైఫండ్‌ను పొందవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ నవంబరు 10, 2008. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.సెయిల్.కో.ఇన్ అనే వెబ్‌సైటు‌ను సంప్రదించగలరు.

వెబ్దునియా పై చదవండి