ఈ ప్లాంట్‌ను ప్రజా సంక్షేమం, ప్రజా వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రాణవాయును రాజపాళెయం, విరుదునగర్, శివకాశి, అరుబ్బుకోట్టై, సాత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.
ఈ ప్లాంట్‌ను రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ సమక్షంలో ఈ ప్లాంట్‌ను విరుదునగర్ జిల్లా కలెక్టర్ ఆర్.కణ్ణన్ ప్రారంభించారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా రోజుకు... 45 లీటర్ ద్రవ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనుంది.