మీ బుడ్డోడు కడుపునొప్పితో బాధపడుతున్నాడా...!

పిల్లలకు తరచూ కడుపునొప్పి వస్తుంటుంది. ఇలా ప్రతి పిల్లవానికి వస్తుందని చెప్పలేము. కాని కొంతమందికి మరీ ఎక్కువగా ఉంటుంది. సర్వసాధారణంగా కనబడే కడుపునొప్పి. దీనిని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్(ఐ.బి.ఎస్) అనికూడా అంటారు. ఇలాంటి కడుపునొప్పి ప్రేగులు మెలిపెట్టేటట్లు వస్తుంటుంది.

ఇలా వచ్చినప్పుడు తరచూ విరేచనాలు అవుతుంటాయి. వారికి వికారంగాకూడా ఉంటుంది. అలాగే తలనొప్పికూడా ఉంటుంది. ఇవి తప్పించి ప్రత్యేకంగా వ్యాధి లక్షణాలు ఏవీ ఉండవు.

ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళల్లో ఆందోళన విపరీతంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో వారికి తల్లిదండ్రులు ధైర్యం కల్పించాలి. ఇలాంటి సందర్భంలో పిల్లలకు ఎక్కువగా పీచుపదార్థం కలిగిని ఆహారాన్ని ఇవ్వాలి. దీంతోబాటు వారికి మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ చికిత్స అందించాలంటున్నారు వైద్యులు.

వెబ్దునియా పై చదవండి