రాజస్థాన్‌లో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి

సెల్వి

గురువారం, 17 జులై 2025 (12:59 IST)
Girl
రాజస్థాన్‌లో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. సికార్‌లోని ఆదర్శ్ విద్యా మందిర్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ప్రాచి కుమావత్ అనే బాలిక లంచ్ టైమ్‌లో తన బాక్స్‌ను తెరుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. 
 
అయితే బాలికను అంబులెన్స్‌లోకి తరలిస్తుండగా ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించింది. ఆమెను బతికించడానికి దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని వైద్యుడు డాక్టర్ ఆర్‌కె జాంగిద్ తెలిపారు. 
 
మంగళవారం పాఠశాల సమయంలో తొమ్మిదేళ్ల బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. ఇప్పుడు ఆమెకు గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు. బాధితురాలు నాలుగో తరగతి చదువుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు