తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లిలో వివాహేతర హత్య జరిగింది. తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జయశంకర్ భూపాలపల్లి కొంపెల్లి గ్రామంలో రవి అనే వ్యక్తి గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తర్వాత 13 యేళ్ల క్రితం వితంతువైన రేణుక అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు సెక్యూరిటీగార్డుగా పనిచేసే శ్రీపాల్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త రవికి తెలియడంతో ఆమెను మందలించసాగాడు.
దీన్ని జీర్ణించుకోలేని రేణుక... తన అక్రమ సంబంధాని భర్త అడ్డు చెపుతున్నాడని భావించి తన ప్రియుడు శ్రీపాల్ రెడ్డి, రవి మొదటి భార్య కుమారుడు శ్రీకర్‌లతో కలిసి రవిని హత్య చేయించింది. దీనిపై రవి మొదటి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హత్య కేసులో పాలుపంచుకున్న రేణుక, ఆమె ప్రియుడు శ్రీపాల్ రెడ్డి, శ్రీకర్‌లను అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు.