'ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న కల ఉంటుంది. నేను మా అమ్మ, నాన్న పెళ్లికి ముందే పుట్టాను. అది మీరు తప్పనుకుంటే దానికి నేనేం చేయగలను!' అని ప్రశ్నిస్తోంది. అదేసమయంలో నిజజీవితంలో మా తండ్రీకూతుళ్ళ మధ్య అనుంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. చాలా డిఫరెంట్. సెట్స్‌లో మేము ప్రొఫెషనల్‌గానే ఉంటాం. తండ్రీకూతుళ్లుగానే నటిస్తున్నా మా పాత్రలు నిజజీవితానికి భిన్నంగా ఉంటాయన్నారు.
పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతానని తాను చెప్పడం పెద్ద వివాదంగా మారింది. పైగా దీనిపై వివరణ కూడా ఇచ్చేశాను. ఇప్పుడు కూడా మీరు ‘పెళ్లెప్పుడు?’ అనడిగితే... తెలీదనే చెబుతాను. ఎందుకంటే, పెళ్లనేది పెద్ద కమిట్‌మెంట్. స్వతంత్రంగా ఉన్న వ్యక్తి మరో వ్యక్తితో బాధ్యతలను పంచుకోవడం బిగ్ కమిట్‌మెంట్. ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను. అప్పుడూ అదే చెప్పాను.
ఆ తర్వాత ‘మిమ్మల్ని తల్లిగా చూడొచ్చా’ అనడిగినా ‘తప్పకుండా’ అని చెప్తాను. ‘భవిష్యత్తులో తల్లి కావాలనుకుంటున్నాను’ అన్నాను. ఆ రెండు సమాధానాన్ని కలిపి.. ‘పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతాను’ అని చెప్పినట్లు వదంతులు పుట్టించారు. ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న కల ఉంటుంది. నేను మా అమ్మ, నాన్న పెళ్లికి ముందే పుట్టాను. అది మీరు తప్పనుకుంటే దానికి నేనేం చేయగలను అని నిర్మొహమాటంగా శృతిహాసన్ చెప్పుకొచ్చింది.