ఈజీ అండ్ టేస్టీ డిష్ "బాదం గాజర్ సలాడ్"

కావలసిన పదార్థాలు :
గాజర్లు.. రెండు
కీరదోసకాయలు.. రెండు
బాదంపప్పు ముక్కలు.. అర కప్పు
నారింజపండ్లు.. రెండు
ఆలీవ్ ఆయిల్.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
మిరియాలపొడి.. సరిపడా

తయారీ విధానం :
గాజర్, కీరదోసకాయలను తురిమి ఉంచుకోవాలి. బాదంపప్పు ముక్కల్ని అందులో కలపాలి. ఒక నారింజ పండును ముక్కలుగా కోసి వాటిలో కలపాలి. రెండో నారింజ పండును జ్యూస్ తీసి అందులో ఆలీవ్ ఆయిల్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబెట్టి పై గాజర్ మిశ్రమంలో పోసి కలిపి సర్వ్ చేయాలి. అంతే ఈజీ అండ్ టేస్టీ గాజర్ సలాడ్ తయార్..! రుచికరమైన ఈ డిష్ తినడంవల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

వెబ్దునియా పై చదవండి