కోవా మిక్స్‌డ్ విత్ "రోజ్ సేమియా"

కావలసిన పదార్థాలు :
సేమియా.. వంద గ్రా.
నీళ్లు.. 200 గ్రా.
కోవా.. 50 గ్రా.
రోజ్ లిక్విడ్.. 50 మి.లీ.
ఐస్ క్యూబ్స్.. తగినన్ని
లెమన్ ఎల్లో కలర్.. చిటికెడు

తయారీ విధానం :
సేమియాను నీటిలో ఉడికించాలి. ఉడికించేటప్పుడే లెమన్ ఎల్లో పౌడర్ వేసుకుంటే సేమియాకు మంచి రంగు వస్తుంది. గ్లాసులో ముందుగా సేమియా వేసి దానిపై క్రష్ చేసిన ఐస్‌ను వేయాలి. తరువాత కోవా వేసి చివరగా రోజ్ లిక్విడ్ వేయాలి. ఇలా లేయర్స్‌గా వేసిన తరువాత టీస్పూన్‌తో కలుపుతూ తినవచ్చు, లేదా మొత్తం కలిపి సర్వ్ చేయవచ్చు. అంతే రోజ్ సేమియా తయార్..!

ఈ రోజ్ సేమియాను ఒబేసిటీతో బాధపడేవాళ్లు, కొలెస్ట్రాల్‌లతో బాధపడేవారు కోవాను మినహాయించి కూడా తయారు చేసుకోవచ్చు. అయితే అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్‌పై రోజ్ లిక్విడ్ వేస్తే సరిపోతుంది. ఇంకేముంది మీరూ ట్రై చేయండి మరి..!

వెబ్దునియా పై చదవండి