క్యాన్సర్ కారకాలను నిరోధించే "మిక్స్‌డ్ బీన్ సలాడ్"

కావలసిన పదార్థాలు :
సోయాబీన్స్... ఐదు టీ.
రాజ్మా... ఐదు టీ.
శనగలు... ఐదు టీ.
టొమోటోలు... మూడు
ఛాట్ మసాలా... ఒకటిన్నర టీ.
కొత్తిమీర తరుగు... రెండు టీ.

డ్రెస్సింగ్ కోసం...
ఆలీవ్ అయిల్... రెండు టీ.
నిమ్మరసం... మూడు టీ.
మిరియాలపొడి, ఉప్పు... తగినంత

తయారీ విధానం :
సోయాబీన్స్, రాజ్మా, శనగలను రాత్రిపూట తగినన్ని నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఉడికించాలి. వీటిల్లో సన్నగా తరిగిన టొమోటో ముక్కలను కలపాలి. చిన్న బాటిల్‌లో ఆలీవ్ ఆయిల్‌, నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి.. ఈ మిశ్రమాన్ని ఉడికించిన గింజలపై చల్లి, పైన ఛాట్ మసాలాను చల్లాలి. చివర్లో కొత్తిమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి.

ఈ సలాడ్ తేలికగా జీర్ణం కావాలంటే... గింజలను సరిగా ఉడికించాలి. ఇందులోని పోషకాలు క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి. చెడుచేసే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించటమే కాకుండా, మంచి చేసే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. కీళ్ల వ్యాధులు, ఎముకలు పెళుసుబారడం లాంటి సమస్యలు దూరం అవుతాయి. ఉదయం, సాయంకాలాల్లో దీన్ని స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి