గుండెని పదిలంగా ఉంచే "రష్యన్ వెజ్ సలాడ్"

కావలసిన పదార్థాలు :
బంగాళాదుంప... వంద గ్రా.
క్యారెట్... వంద గ్రా.
బీన్స్... వంద గ్రా.
పచ్చిబఠాణీలు... 50 గ్రా.
మెయొనైజ్... వంద గ్రా.
ఫైనాఫిల్ ముక్కలు... 20 గ్రా.
ఉప్పు, మిరియాలపొడి... తగినంత
నూనె... నాలుగు టీ.

తయారీ విధానం :
అన్ని కూరగాయలను కడిగి, పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిల్లో బఠాణీలు కలిపి, తగినన్ని నీరుపోసి ఉడికించాలి. ఫైనాఫిల్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. విడిగా ఓ గిన్నెలో నూనె, ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. మరో పెద్ద పాత్రలో ఉడికించిన కూరగాయల ముక్కలను వేసి, ఉప్పు మిరియాలపొడి మిశ్రమం, మెయొనైజ్‌ను వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.

చివర్లో ఫైనాఫిల్ ముక్కలతో గార్నిష్ చేసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక సర్వ్ చేయాలి. అంతే రష్యన్ వెజ్ సలాడ్ రెడీ అయినట్లే..! బంగాళాదుంపలోని పిండి పదార్థాలు.. బీన్స్, బఠాణీలలో ఉండే ప్రొటీన్లు, పీచు పదార్థాలు శరీరానికి శక్తి నివ్వటమేగాక... గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడతాయి.

ఫైనాఫిల్‌లో విటమిన్ సి, క్యాల్షియంలతోపాటు ఇతర పోషకాలెన్నో సమృద్ధిగా లభిస్తాయి. వీటన్నింటితో కలిపి తయారుచేసిన సలాడ్‌ని ప్రతిరోజూ ఒక కప్పు తీసుకున్నట్లయితే, ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

వెబ్దునియా పై చదవండి