కావలసిన పదార్థాలు : మైదా.. పావు కేజీ ఉప్పు.. అర టీ. పంచదార.. ఒక టీ. పచ్చిమిర్చి ముద్ద.. అర టీ. అల్లం, పచ్చిమిర్చి.. ఒక టీ. కొత్తిమీర.. అర కట్ట ఈస్ట్.. రెండున్నర టీ. వెన్న.. 3 టీ. ఉప్పు.. తగినంత కొబ్బరి తురుము.. పావు కప్పు పంచదార.. పావు కప్పు
తయారీ విధానం : మైదాలో ఒక టీస్పూన్ పంచదార వేసి కలపాలి. అరకప్పు గోరువెచ్చటి నీటిలో పావుకప్పు పంచదార, ఈస్ట్‌లను వేసి కలిపి ఉంచాలి. మైదాపిండిని గుంటలా చేసి అందులో ఈస్ట్ మిశ్రమాన్ని పోసి ముద్దలా చేయాలి. దీనికి ఓ టీస్పూన్ వెన్న కలిపి 5 నిమిషాలు బాగా కలిపి.. తడిగుడ్డ కప్పి, గంటసేపు అలాగే ఉంచాలి.
పిండిని మళ్లీ ఓసారి కలిపి.. చిన్న సైజులో పది ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చేత్తో ఒత్తి అందులో కొబ్బరితురుము, ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, అల్లం, పచ్చిమిర్చి.. కొత్తిమీర తరుగులతో కలిపిన స్టఫ్‌ను కొద్దిగా మధ్యలో ఉంచి చుట్టేయాలి. అలా అన్నింటినీ చేశాక బేకింగ్ ట్రేకి వెన్నరాసి అందులో సర్ది.. తడిబట్టకప్పి 20 నిమిషాలు ఉంచాలి.
ఓవెన్ ముందుగానే వేడి చేసి ఆపై బేకింగ్ ట్రేను పెట్టి పదినిమిషాలపాటు ఉంచాలి. తర్వాత బయటకు తీసి ఆ ఉండలను నచ్చిన ఆకారంలో మడచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టి వెన్నగానీ, నెయ్యిగానీ వేసి అందులో ఈ ఉండలను వేయించి వేడిగా ఏదేనీ సాస్‌తో కలిపి తింటే రుచిగా ఉంటాయి.