కావలసిన పదార్థాలు : గోధుమ బ్రెడ్.. పది స్లైసులు శనగపిండి.. ఒక టీ. ఉల్లిపాయ.. ఒకటి కారం.. ఒక టీ. ఉప్పు.. తగినంత కోడిగుడ్లు.. గిలకొట్టినవి నాలుగు పచ్చిమిర్చి.. ఐదు టొమోటో.. ఒకటి నూనె.. రెండు టీ.
తయారీ విధానం : బాణలిలో నూనె పోసి.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండిని వేసి వేయించాలి. ఆపై కోడిగుడ్ల సొనను పోసి, బాగా కలియబెడుతూ వేయించాలి. అందులోనే మరికాస్త నూనె పోసి.. బ్రెడ్ ముక్కలను కూడా కలిపి వేయించాలి. కాసేపు అలాగే వేగిన తరువాత ఉప్పు, కారం, టొమోటో ముక్కలను కూడా వేసి బాగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి ఎగ్ బ్రెడ్ స్క్రాంబుల్ రెడీ..! దీన్ని స్నాక్స్గానూ, చపాతీల్లోకి సైడ్ డిష్గానూ వాడుకోవచ్చు.