కావలసిన పదార్థాలు : మైదా... పావు కేజీ పంచదార పొడి... పావు కేజీ వెన్న... 200 గ్రా. కండెన్స్‌డ్ మిల్క్ (మిల్క్‌మెయిడ్)... 200 గ్రా. చాక్లెట్ పౌడర్... 75 గ్రా. బాదంపప్పు ముక్కలు... వంద గ్రా. బేకింగ్ పౌడర్... ఒక టీ.
తయారీ విధానం : మైదా, చాక్లెట్ పౌడర్, బేకింగ్ పౌడర్‌లను కలిపి జల్లించాలి. పంచదార పొడిలో వెన్న, బాదంపప్పు ముక్కలు వేసి మునివేళ్లతో కొద్దిసేపు కలిపి మిల్క్‌మెయిడ్ వేసి మృదువుగా కలపాలి. తరవాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా విడదీసి చపాతీలా వత్తి గుండ్రంగా లేదా దీర్ఘ చతురస్రంలా లేదా మనకు నచ్చిన మరేదైనా ఆకారంలో కోసుకోవాలి.
వెన్న రాసిన బేకింగ్ ట్రేలో వీటిని ఉంచి 375 డిగ్రీల ఫారన్‌హీట్‌లో 20 నిమిషాలపాటు మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేసి తీయాలి. లేదా ఇసుక ఓవెన్, కుక్కర్‌లలో సుమారు అరగంటసేపు ఉడిగించాలి. చల్లారిన తరవాత డబ్బాలో పెడితే 15 రోజులవరకూ నిల్వ ఉంటాయి.