నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

ఐవీఆర్

శనివారం, 26 జులై 2025 (12:16 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
తను ఇటీవల అరెస్టయిన సమయంలో తన ఇంటికి పోలీసులు వచ్చారనీ, వారు తమ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో నా మేనేజర్ తో నా భార్య ఫోను కాల్ చేసిందన్నారు. వెంటనే పోలీసులు నా మేనేజర్ కి కాల్ చేసి నువ్వు మేడంకి ఎందుకు కాల్ చేసావంటూ నిలదీశారనీ, దీన్నిబట్టి నా భార్య ఫోనుని కూడా ట్యాప్ చేసారని అర్థమవుతోందన్నారు. తమ ఫోన్లే కాదు రాష్ట్రంలో చాలామంది నాయకులవి, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసారంటూ ఆరోపించారు కౌశిక్ రెడ్డి.
 

భార్యాభర్తల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి !!

నా భార్య ట్యాపింగ్ చేసిన రేవంత్ రెడ్డి !!

- MLA‌ కౌశిక్‌ రెడ్డి#Telangana pic.twitter.com/Z6s5s9HujW

— ఉత్తమ్ || Utt@m (@UttamKBRS) July 25, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు