చైనీస్ గోబీని ఎలా తయారు చేస్తారు?

సోమవారం, 7 ఏప్రియల్ 2014 (19:20 IST)
File
FILE
కావలసిన పదార్ధాలు :
కాలీఫ్లవర్ - ఒకటి, ఉల్లిపాయలు - ఒకటి, కోడిగుడ్డు - ఒకటి, మైదా పిండి - నాలుగు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి - పది రెబ్బలు, అల్లం - చిన్న ముక్క, కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, నూనె - కావలసినంత, ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం :
ముందుగా కాలీఫ్లవర్‌ను మూడు నిముషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కోడిగుడ్లను పగులగొట్టి వాటిలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్‌లను వేసి కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. బాణాలిలో నూనె వేసి కాచాలి. కాగాక మైదా మిశ్రమంలో ఉడికించన కాలీఫ్లవర్‌ను ముంచి నూనెలో వేయించి తీయాలి.

ఆ బాణాలిలో మిగిలి ఉన్న నూనెలో వెల్లుల్లి, అల్లం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి. ఇందులోనే సోయా సాస్ వేసి కలిపి కాసిన్ని నీరు పోసి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలిపి అవసరమైతే పైన కొత్తిమీర తురుమును జల్లి దించి సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి