చైనీస్ స్పెషల్ "బటర్‌ గార్లిక్‌ ప్రాన్స్‌"

కావలసిన పదార్థాలు :
పెద్దసైజు రొయ్యలు... అర కేజీ
ఉప్పు... సరిపడా
మిరియాలపొడి... అర టీ.
చిల్లీసాస్... మూడు టీ.
కోడిగుడ్డు... ఒకటి
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
మైదా... రెండు టీ.
నూనె... సరిపడా
వెన్న... 50 గ్రా.
వెల్లుల్లి... 30 గ్రా.

తయారీ విధానం :
పొట్టు తీసిన రొయ్యల్ని శుభ్రంచేసి.. వాటిల్లో తగినంత ఉప్పు, మిరియాలపొడి, చిల్లీసాస్‌, కోడిగుడ్డు, కార్న్‌ఫ్లోర్‌, మైదాపిండి కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి. మందపాటి బాణలిలో నూనె వేసి కాగిన తరువాత రొయ్యల్ని కొద్దికొద్దిగా వేసి బాగా ఎర్రగా వేయించి తీసేయాలి.

మరో బాణలిలో వెన్న వేసి కరిగాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని దోరగా వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. తరువాత అందులోనే వేయించి తీసిన రొయ్యల్ని కూడా వేసి బాగా కలిపి వడ్డించాలి. అంతే బటర్‌ గార్లిక్‌ ప్రాన్స్‌ తయారైనట్లే...! ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదైనా సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి