"టొమోటో స్క్వాష్"తో వస్తుంది జోష్..!!

FILE
కావలసిన పదార్థాలు :
వడబోసిన టొమోటో రసం.. ఒక కప్పు
పంచదార.. ఒకటిన్నర కప్పు
నీళ్లు.. అర కప్పు
ఉప్పు.. చిటికెడు
సిట్రిక్ యాసిడ్.. చిటికెడు
రంగు.. చిటికెడు
సోడియం బెంజొయేట్.. కాస్తంత

తయారీ విధానం :
ఎర్రని టొమోటోలను శుభ్రం చేసి 5 నుంచి 10 నిమిషాలపాటు ఉడికించాలి. వీటిని బాగా మెదిపి, గింజలు లేకుండా రసాన్ని వడబోసి ఉంచాలి. మంచినీరు, పంచదార పాకం పట్టాలి. ఈ పాకంలో ఉప్పు, సిట్రిక్ యాసిడ్ కలిపి పాకం వేడిగా ఉన్నప్పుడే టొమోటో రసంలో కలపాలి.

చల్లారిన తరువాత సోడియం బెంజొయేట్ కూడా కలిపి బాటిల్‌లో పోసి మూత గట్టిగా బిగించి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. వాడుకునేటప్పుడు టొమోటో స్క్వాష్‌కి మూడు వంతులు నీటిని కలిపి సర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతే టొమోటో స్క్వాష్ తయారైనట్లే..!!

వెబ్దునియా పై చదవండి