నాడీ వ్యవస్థ ఉల్లాసానికి "గ్రీన్ లీవ్‌స్‌ బాదం సలాడ్"

FILE
కావలసిన పదార్థాలు :
బాదం, జీడి, వాల్‌నట్స్.. తలా అర కప్పు చొప్పున
దోరగా వేయించిన నువ్వులు.. 5 టీ.
పాలకూర, క్యాబేజీ తరుగు.. ఒక పెద్ద కప్పునిండా
ఫ్రెంచ్ డ్రెసింగ్.. ఏడు టీ.

తయారీ విధానం :
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌ను దోరగా వేయించి చిన్న చిన్న పలుకుల్లా ఉండేలా దంచి ఉంచుకోవాలి. ఇప్పుడు పాలకూర, క్యాబేజీ ఆకులను తీసుకుని వెడల్పాటి పాత్రలో వేసి.. అందులో పప్పుల పొడిని వేసి బాగా కలియబెట్టాలి. తరువాత ముందే సిద్ధం చేసి ఉంచుకున్న ఏడు టీస్పూన్ల ఫ్రెంచ్ డ్రెసింగ్‌ను కూడా వేసి బాగా కలిపాలి. అంతే గ్రీన్ లీవ్‌స్‌బాదం సలాడ్ తయార్..!

దీన్ని నేరుగా అలాగే అయినా తినేయవచ్చు. లేదంటే బ్రెడ్‌తో కలిపి కూడా తినవచ్చు. బాదం పలుకుల్లో బి విటమిన్, మెగ్నీషియం, ఐరన్, ఇతర ఫ్యాటీయాసిడ్స్ పుష్కళంగా ఉంటాయి. ఇవన్నీ మెదడును, నాడీ వ్యవస్థను ఉల్లాసంగా ఉండేందుకు సహకరిస్తాయి.

వెబ్దునియా పై చదవండి