కావలసిన పదార్థాలు : నూడుల్స్... అర కేజీ క్యాబేజీ... 200 గ్రా. క్యారెట్... 200 గ్రా. బీన్స్... వంద గ్రా. ఉల్లిపాయలు... నాలుగు వెల్లుల్లి... 8 రెబ్బలు అల్లం... చిన్న ముక్క చిల్లీసాస్... నాలుగు టీ. అజినమోటో... అర టీ. ఉప్పు... తగినంత కార్న్‌ఫ్లోర్... 60 గ్రా. నూనె... తగినంత
తయారీ విధానం : నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఉడికించాలి. తరువాత వాటిని దించి చిల్లుల ప్లేటులో వేయాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి నీళ్లు వార్చిన నూడుల్స్‌ను వేసి వేయించాలి. విడిగా ఓ పాన్‌లో సన్నగా తరిగిన అల్లంవెల్లుల్లి ముక్కల్ని వేసి సన్నగా పొడవుగా తరిగిన కూరగాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా వేయించి, గ్లాసు నీరు పోసి ఉడికించాలి.
ఆపై తగినంత ఉప్పు, చిల్లీసాస్, అజినమోటో వేసి కలిపి దించాలి. కార్న్‌ఫ్లోర్‌ను కాసిన్ని నీళ్లలో కలిపి, చిల్లీసాస్‌లో పోస్తే చిక్కగా తయారవుతుంది. దీన్ని నూడుల్స్ మీద పోసి వేడిగా వడ్డించాలి. అంతే అమెరికన్ చాప్సీ తయార్...!!