పార్స్‌లీ ఘుమఘుమల "లాబ్‌స్టర్ థెర్మిడార్"

FILE
కావలసిన పదార్థాలు :
లాబ్‌స్టర్స్... నాలుగు
పార్మిసన్ ఛీజ్... పావు కేజీ
వెల్లుల్లి.. వంద గ్రా.
సెల్‌రీ అండ్ లీక్.. వంద గ్రా.
ఆలీవ్ ఆయిల్.. 2 టీ.
పార్స్‌లీ.. చిటికెడు
షైరీ వైన్ లేదా వైట్ వైన్.. 600 గ్రా.
పాల మీగడ.. 400 గ్రా.
మిరియాలపొడి.. తగినంత
ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
లాబ్‌స్టర్ మాంసాన్ని ముక్కలుగా కోసి ఓ గిన్నెలో ఉంచాలి. బాణలి స్టవ్‌పై ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి, వెల్లుల్లి ముక్కలు, సెల్‌రీ అండ్ లీక్ వేసి దోరగా వేయించాలి. తరువాత లాబ్‌స్టర్ ముక్కల్ని కూడా వేసి బాగా కలియబెట్టి మూడు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఆపై షైరీ వైన్ పోసి బాగా కలపి, పాలమీగడ వేసి నాలుగైదు నిమిషాలు పెద్ద మంటపై ఉడికించాలి.

రుచికి తగినంత మిరియాలపొడి, ఉప్పు వేసి మళ్లీ కాసేపు ఉడికించాలి. ఈ కూరను ఓ గిన్నెలో వేసి, పైన పార్మిసన్ ఛీజ్ వేసి మూడు నిమిషాలపాటు మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి బేక్ చేయాలి. ఓవెన్‌లోంచి గిన్నెను తీసి సర్వ్ చేసేటప్పుడు పైన పార్స్‌లీ ఆకుల్ని వేసి సర్వ్ చేయాలి. అంతే లాబ్‌స్టర్ థెర్మిడార్ తయార్..!

వెబ్దునియా పై చదవండి