కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు.. పావు కేజీ ఉప్పు.. తగినంత మిరియాలపొడి.. పావు టీ. నిమ్మకాయ.. ఒకటి సేమ్యా.. వంద గ్రా. గుడ్డు... ఒకటి నూనె.. తగినంత
తయారీ విధానం : బంగాళాదుంపల్ని తొక్క తీసి ఉడికించాలి. దుంపలు కాస్త చల్లారాక వాటిని గరిటెతో మెత్తగా మెదపాలి. అందులోనే మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డు ఆకారంలో ఉండలుగా చేయాలి. ఓ చిన్నగిన్నెలో గుడ్డుసొన వేసి బాగా గిలకొట్టాలి.
ఉండలుగా చేసిన దుంప ముద్దల్ని గుడ్డుసొనలో ముంచి తరువాత సేమ్యాలో దొర్లించి తీయాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఓ బాణలిలో నూనె పోసి బాగా కాగుతుండగా పై ఉండల్ని వేసి బాగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడిగా, కమ్మటి రుచిగల "బర్డ్స్ నెస్ట్" సిద్ధమైనట్లే..!