కావలసిన పదార్థాలు : సగానికి కట్ చేసిన చికెన్ బ్రెస్ట్‌లు... పది నీరు... అర లీ. ఉప్పు... అర టీ. మిరియాలపొడి, వెల్లుల్లి పేస్ట్... చెరో టీ. కారంపొడి, ఆలీవ్ ఆయిల్... చెరో 3 టీ. ఉల్లిపాయ... ఒకటి వెల్లుల్లి తరుగు... నాలుగింటిది టొమోటో సూప్... రెండు కప్పులు మొక్కజొన్న గింజలు, బీన్స్... చెరో కప్పు క్రీమ్... అర కప్పు చికెన్ బులియన్ క్యూబ్స్... ఐదు
తయారీ విధానం : నీటిని మరిగించి చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి, ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి పేస్టు, చికెన్ క్యూబ్స్ వేసి చిన్న మంటమీద గంటసేపు ఉడికించాలి. మరో పాత్రలో ఆలీవ్ ఆయిల్ వేడిచేసి అందులో ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. అందులో టొమోటో ముక్కలు, టొమోటో సూప్, కారం, మొక్కజొన్న, బీన్స్, క్రీమ్ వేసి కలిపి ముందుగా ఉడికించిన చికెన్ మిశ్రమాన్ని కూడా కలపాలి. దీన్ని సన్నటి మంటమీద మరో గంటసేపు ఉడికించి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
స్పైసీగా ఉండే ఈ చికెన్ సూప్‌లో కేలరీలు, ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం, కార్బోహైడ్రేటులు, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. మంచి శక్తినిచ్చే ఈ సూప్‌ను మీరు కూడా తయారు చేస్తారు కదూ...?!