ఫిష్ చిప్స్

కావలసిన పదార్థాలు :
చేపముక్కలు... అర కేజీ
జీరా... రెండు టీ.
నూనె... తగినంత
వెనిగర్... ఒక టీ.
మొక్కజొన్న పిండి... పది టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
కొంత జీరాను పొడి చేసి ఉంచాలి. కట్ చేసిన చేపముక్కలను ఉప్పుతో కలిపి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. జీరా పొడిని, వెనిగర్‌ను కలిపి ఓ గిన్నెలో ఉంచుకోవాలి. మొక్కజొన్న పిండిలో తగినంత నీరుపోసి, బాగా పల్చగా ఉండేలా చేసి, జీరాను దానికి కలపాలి. నూనెను వేడిచేసి ఒక్కో చేపముక్కను పిండిలో ముంచి నూనెలో వేయాలి. చేపముక్కలను రెండువైపులా ఎర్రగా కాల్చి తీసి.. వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఫిష్ చిప్స్ సిద్ధమైనట్లే...!

వెబ్దునియా పై చదవండి