హీరో నారా రోహిత్ తన మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులని అలరించింది. బ్యాచిలర్ గా రోహిత్ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. సుందరకాండ హ్యుమర్, సోల్ ఫుల్ రిఫ్రెషింగ్ ఎక్స్ పీరియన్స్‌ని అందించబోతోంది.