వర్షంలో వెచ్చగా... "కాలీఫ్లవర్ సూప్"

కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్... పెద్దది ఒకటి
వెన్న... మూడు టీ.
ఉల్లిపాయ... ఒకటి
బియ్యంపిండి... మూడు టీ.
పాలు... మూడు కప్పులు
పెరుగు... ఒక కప్పు
మిరియాలపొడి... ఒక టీ.
ఉప్పు... కొద్దిగా

తయారీ విధానం :
కాలీఫ్లవర్‌ను ముక్కలుగా విడదీసి, వేడినీటిలో వేసి శుభ్రంచేసిన తరువాత వాటిలో కొద్దిగా నీరుపోసి ఉడికించాలి. మరో బాణలిలో వెన్నను వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక, బియ్యంపిండి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తరువాత పాలు, పెరుగు, ఉప్పు, మిరియాలపొడి కూడా వేసి కలిపి మూత పెట్టాలి.

ఈలోగా కాలీఫ్లవర్ ముక్కలను గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో ఉడుకుతున్న మిశ్రమం చిక్కబడిన తరువాత కాలీఫ్లవర్ ముద్దను కూడా అందులో వేసి బాగా కలియబెట్టాలి. పదినిమిషాల తరువాత దించేసి ఈ పదార్థాన్ని బౌల్స్‌లో పోసి, పైన వెన్న కలిపి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన వేడి వేడి కాలీఫ్లవర్ సూప్ రెడీ...!

వెబ్దునియా పై చదవండి