కావలసిన పదార్థాలు : ఉడికించిన నూడుల్స్... పావుకేజీ క్యారెట్ తరుగు... అర కప్పు క్యాప్సికం తరుగు.. అర కప్పు ఉల్లి తరుగు.. అర కప్పు మష్రూమ్ తరుగు.. అర కప్పు క్యాబేజీ తరుగు.. ఒక కప్పు వెల్లుల్లి తరుగు.. 3 టీ. సోయా సాస్.. అర టీ. ఉప్పు.. తగినంత కార్న్‌ఫ్లోర్... 3 టీ. పంచదార.. అర టీ. నూనె.. సరిపడా వెనిగర్.. తగినంత
తయారీ విధానం : ముందుగా వెనిగర్, సోయాసాస్, పంచదార, ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌లను ఒక బౌల్‌లోకి తీసుకుని సరిపడా నీరుపోసి ఒక కప్పు మిశ్రమం అయ్యేలాగా చేసుకోవాలి. ముందుగా పాన్‌లో 3 టీస్పూన్ల నూనె వేసి ఉల్లి, వెల్లుల్లి ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. తరువాత క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం, మష్రూమ్ ముక్కల్ని వేసి మీడియం మంటమీద రెండు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు వీటికి ముందే తయారు చేసిన వెనిగర్ సోయాసాస్‌ల మిశ్రమాన్ని జతచేసి బాగా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించి దించి పక్కనుంచాలి. ఉడికించి నీరు వార్చేసిన నూడుల్స్ మీద చల్లటి నీరు పోసి బాగా వడగట్టి కాసేపు ఆరబెట్టాలి. వీటిని నూనెలో ఎర్రగా వేయించి పేపర్‌పై వేయాలి. తరువాత సర్వింగ్ ప్లేట్లలో వేయించిన నూడుల్స్‌ను సర్ది.. పైన వెజిటబుల్ మిశ్రమాన్ని పోసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.