వెరైటీ అండ్ టేస్టీ "కంట్రీ కాప్‌టైన్"

FILE
కావలసిన పదార్థాలు :
మటన్.. అర కేజీ
గరంమసాలా.. 5 గ్రా.
మిరియాలు.. 10 గ్రా.
ఉల్లిపాయలు.. 100 గ్రా.
చక్కెర.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
అల్లం, వెల్లుల్లి.. రెండు టీ.
జీలకర్ర.. 50 గ్రా.
ఎండుమిర్చి.. 25 గ్రా.
వెనిగర్.. 3 టీ.
బంగాళాదుంపలు.. 100 గ్రా.
పసుపు.. అర టీ.
నూనె.. 75 గ్రా.

తయారీ విధానం :
మటన్‌ను శుభ్రం చేసి నీరు పిండేసి ఉప్పు, పసుపు కలిపి పక్కనుంచాలి. జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, గరంమసాలాలను పొడిగా వేయించి, వాటిని వెనిగర్‌తో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మసాలా ముద్దకు పసుపు చేర్చి.. మటన్‌కు కలిపి అరగంటసేపు నానబెట్టాలి. ఒక బాణలిలో నూనె పోసి కాగాక చక్కెర, నూరిన ఉల్లిముద్ద వేసి ఎర్రగా వేయించాలి.

ఆపై అల్లం వెల్లుల్లి ముద్ద, మటన్‌ను కలిపి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. మటన్ బాగా ఉడికి.. కూర చిక్కబడిన తరువాత, దించేసి.. వేరే గిన్నెలోకి మార్చేయాలి. ఇప్పుడు బంగాళాదుంపలను పొట్టుతీసి దళసరిగా గుండ్రటి చక్రాల్లాగా తరిగి నూనెలో వేయించి, మటన్ మీద అమర్చి.. సర్వ్ చేయాలి. అంతే వెరైటీ అండ్ టేస్టీ కంట్రీ కాప్‌టైన్ సిద్ధం..!

వెబ్దునియా పై చదవండి