"స్టీమ్డ్ మీట్ రోల్" విత్ ఫ్రైయిడ్ పెప్పర్

FILE
కావలసిన పదార్థాలు :
మటన్ ముక్కలు.. అర కేజీ
ఉల్లి ముక్కలు.. అర కప్పు
బ్రాందీ.. ఒక టీ.
కార్న్‌ఫ్లోర్.. రెండు టీ.
వెల్లుల్లి ముక్కలు.. అర టీ.
ఎగ్ వైట్.. 3 (గుడ్లను పగులగొట్టి ఉడకబెట్టిన మిశ్రమం)
గుడ్డు.. ఒకటి
సాల్ట్, వేయించిన పెప్పర్.. సరిపడా

తయారీ విధానం :
ఉడికించిన ఎగ్ మిశ్రమం పక్కనబెట్టి పైన చెప్పిన మిగతా అన్నింటినీ ఒక బౌల్‌లో కలిపి చిక్కగా, మృదువుగా ఉండేలా చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం ఒక మందపాటి గుడ్డపై పోసి.. పైన ఫ్రైయిడ్ పెప్పర్ పౌడర్ వేసి సమానంగా సర్ది.. దానిపై ఉడికించి ఎగ్ మిశ్రమాన్ని వేసి.. గుడ్డను జాగ్రత్తగా రోల్ చేయాలి.

కుక్కర్‌లో ఉంచి పావుగంటసేపు ఆవిరిమీద ఉడికించాలి. తరువాత దాన్ని బయటికి తీసి స్లైసెస్‌గా కట్ చేసి, ఏదైనా సాస్‌తోటి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే స్టీమ్‌డ్ మీట్ రోల్ సిద్ధమైనట్లే..!

వెబ్దునియా పై చదవండి