"ఆలూ క్యారట్ డిలైట్" విత్ బ్రెడ్ పౌడర్

కావలసిన పదార్థాలు :
ఆలుగడ్డ కూర.. ఒక కప్పు
క్యారెట్.. ఒకటి
పనీర్.. కొద్దిగా
కొత్తిమీర తరుగు.. రెండు టీ.
బ్రెడ్ పొడి.. ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు.. ఒక టీ.
గరంమసాలా.. ఒక టీ.
అల్లంవెల్లుల్లి ముద్ద.. అర టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
ముందుగా క్యారెట్‌ను ఉడికించి అందులో పనీర్ వేసి బాగా కలపాలి. దీనికి ఆలుగడ్డ కూర చేర్చాలి. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు ఇతర దినుసులు వేసి చపాతీ పిండిలా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనెపోసి వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి అరచేతితోనే కాస్త మందంగా బిస్కెట్ల మాదిరిగా చేసుకోవాలి.

వీటిని బ్రెడ్ పొడిలో అటుఇటూ పొర్లించి.. బాగా కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీయాలి. వీటిని సాస్ లేదా చట్నీతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతే ఆలూ క్యారట్ డిలైట్ తయార్..!

వెబ్దునియా పై చదవండి