కావలసిన పదార్థాలు : ఫ్రెంచ్ బీన్స్... ముప్పావు కేజీ ఫ్రెంచ్ డ్రెసింగ్... 3 టీ. దోరగా వేయించిన బాదంపలుకులు... 75 గ్రా.
తయారీ విధానం : ఫ్రెంచ్ బీన్స్‌ను చక్కగా పీచుతీసి పొడుగ్గా అలాగే ఉంచేయాలి. వీటిని ఉప్పువేసిన నీటిలో ఐదారు నిమిషాలపాటు ఉడికించి, మరీ మెత్తగా కాకుండా సగం ఉడకగానే దించేసి నీటిని వంపేయాలి. వీటిని ఓ వెడల్పాటి పాత్రలో వేసి వాటిపై మూడు టీస్పూన్ల ఫ్రెంచ్ డ్రెసింగ్‌ను పోయాలి. చివరగా బాదం పలుకులు చల్లితే సరిపోతుంది. అంతే ఫ్రెంచ్ బీన్స్ సలాడ్ సిద్ధమైనట్లే..
ఈ సలాడ్‌ను చల్లగా లేదా వేడివేడిగా ఎలాగైనా తినవచ్చు. ఆకుపచ్చని ఈ ఫ్రెంచ్ బీన్స్‌లో క్యాల్షియం, మెగ్నీషియం, బోరోన్.. సి, బి, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి మెదడుకు ఎంతో విశ్రాంతిని ఇస్తాయి. ప్రశాంతమైన భావన కలుగుతుంది.