కావలసిన పదార్థాలు : టొమోటోలు.. 8 క్యాప్సికమ్.. ఒకటి ఉల్లికాడ.. ఒకటి కీరా.. ఒకటి వెల్లుల్లి రెబ్బలు.. 3 బ్రెడ్ స్లయిస్.. 2 టొమోటో ప్యూరీ.. 2 పెద్ద టీ. ఆలీవ్ ఆయిల్.. 2 పెద్ద టీ. వెనిగర్.. ఒకటిన్నర పెద్ద టీ. ఉప్పు.. అర టీ. మిరియాలపొడి.. అర టీ. నీళ్లు.. ఒక గ్లాసు
తయారీ విధానం : వెల్లుల్లి రెబ్బలను చితగ్గొట్టి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. టొమోటోలు, క్యాప్సికం, ఉల్లికాడలు, కీరాలను ముక్కలుగా తరిగి వెల్లుల్లి వేసిన పాత్రలో వేయాలి. బ్రెడ్ స్లయిసుల అంచులు కోసి, మెత్తగా నలిపి అదే పాత్రలో వేయాలి. ఇప్పుడు ఆ గిన్నెలో ఒక గ్లాసుడు నీళ్లు, వెనిగర్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబెట్టి బ్లెండర్‌లోవేసి బాగా కలిసేలా చేయాలి.
దీన్ని ఏదేని బౌల్‌లో పోసి ఆలీవ్ ఆయిల్ చేర్చి బీటర్‌తో బాగా బీట్ చేయాలి. దాంట్లోనే టొమోటో ప్యూరీని కూడా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తరువాత గాజు బౌల్స్‌లో పోసి సర్వ్ చేయాలి. అంతే కలర్‌ఫుల్ అండ్ హెల్దీ డిష్ కూల్ టొమోటో సూప్ తయార్..!