కావలసిన పదార్థాలు : ఉడికించిన చికెన్ ముక్కలు.. 2 కప్పులు ఉడికించిన న్యూడుల్స్.. 2 కప్పులు ఉడికించిన పచ్చిబఠానీలు.. ఒక కప్పు టొమోటో సూప్ పొడి.. ఆరు టీ. నీరు.. ఒక కప్పు టొమోటో కెచప్.. అర కప్పు కొత్తిమీర తరుగు.. 2 టీ. క్యాప్సికమ్ తరుగు.. అర కప్పు వెన్న.. 3 టీ. ఎండబెట్టి పొడి చేసిన రొట్టె ముక్కలు.. అర కప్పు ఉప్పు.. తగినంత మిరియాలపొడి.. సరిపడా
తయారీ విధానం : లోతున్న పాత్రలో నీరు పోసి, మరుగుతుండగా టొమోటో సూప్ పొడి, ఉప్పువేసి బాగా మరగనివ్వాలి. దించి దాంట్లో చికెన్ ముక్కలు, ఉడికించిన న్యూడిల్స్, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమోటో కెచప్, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
ఇప్పుడు ఒక బేకింగ్ పాత్రను తీసుకుని దాని లోపలి భాగంలో కొంచెం వెన్న రాసి, పై మిశ్రమాన్ని వేయాలి. పైన రొట్టె ముక్కల పొడి, వెన్న వేసి, 30 నిముషాల పాటు మైక్రోవేవ్ ఓవెన్లో సాధారణ ఉష్ణోగ్రత వద్ద బేక్ చేసి తీసేయాలి. అంతే చికెన్ అలెగ్జాండర్ రెడీ..!