చైనీస్ స్టయిల్ "స్పెషల్ ఎగ్ ఖేష్"

FILE
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు.. నాలుగు
ఉల్లితరుగు.. అర కప్పు
పుట్టగొడుగులు.. ఆరు
ఉప్పు.. తగినంత
క్యాప్సికమ్ తరుగు.. పావు కప్పు
పొట్టుతీసిన బంగాళాదుంప.. ఒకటి
వెజిటబుల్ ఆయిల్.. రెండు టీ.
నల్ల మిరియాలపొడి.. రెండు టీ.

తయారీ విధానం :
ఉల్లిముక్కలు, క్యాప్సికమ్ తరుగు, చక్రాల్లాగా తరిగిన బంగాళాదుంప ముక్కలను వేరు వేరుగా నూనెలో వేయించి తీసేయాలి. గుడ్లను పగులగొట్టి.. అందులో ఉప్పు, మిరియాలపొడి చేర్చి పక్కనుంచాలి. ఒక పాత్రకు నూనె పూసి.. బంగాళాదుంప, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పుట్టగొడుగు ముక్కలను పొరలు పొరలుగా ఉంచాలి.

దానిపై పగులగొట్టిన గుడ్ల సొనను పోసి.. పైన కాసిన్ని నల్ల మిరియాలను చల్లాలి. మైక్రోవేవ్ ఓవెన్‌ను ముందుగానే కాసేపు వేడిచేసి.. ఆ తరువాత పై పాత్రను ఉంచి.. సాధారణ ఉష్ణోగ్రత వద్ద గుడ్ల సొన పూర్తిగా ఉడికేంతదాకా ఉంచి తీసేయాలి. అంతే ఎగ్ ఖేష్ సిద్ధమైనట్లే..!

వెబ్దునియా పై చదవండి